సుండుపల్లెలో అధికార వైకాపా పార్టీ ఉన్నట్టా లేనట్టా
అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం న్యాయం న్యూస్ మే 30
సుండుపల్లె వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటితో మూడు సంవత్సరాలు పూర్తయిన తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా దివంగత నేత రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం తోపాటు కేకులు కట్ చేసి వైకాపా నాయకులు సంబరాలు జరుపుకుంటున్నారు.
సుండుపల్లి మండలంలో మాత్రం కనీసం రాజన్న విగ్రహానికి పూలమాలలు వేయలేని స్థితిలో వైకాపా నాయకులు ఉన్నారా? అని పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు.మండల ప్రజలందరితో సత్సంబంధాలు కలిగి ఉన్న నాయకుడిని దూరం పెట్టడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మనుగడ కోల్పోతుండడం గమనార్హం ఆ నాయకుడికి పార్టీపై మక్కువ ఎక్కువే అయినా కొందరు పన్నుతున్న కుట్రలకు దూరంగా వుండటం జరుగుతూ వస్తోంది ఏది ఏమైనా మండలంలో పార్టీ పటిష్టంగా ఉండాలంటే ఆ నాయకుడికి పగ్గాలు అప్పగిస్తే తప్ప గాడిన పడే పరిస్థితి లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు