బడి ఈడు పిల్లలను పాఠశాలలో చేర్పించాలి

బడి ఈడు పిల్లలను పాఠశాలలో చేర్పించాలి 

 ప్రధాన  ఉపాధ్యాయుడు శ్రీ అబీదుల్లా

 

 అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం  న్యాయం  న్యూస్ జులై 19

 

 సుండుపల్లి మండలం మండల పరిధిలోని గ్రామాల్లో తిరుగుతూ బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే కార్యక్రమం లో పింఛా సముదాయం ప్రధానోపాధ్యాయులు శ్రీ  అబీదుల్లా  సిఆర్పీ ఎం. కిరణ్ కుమార్ నాయక్ మండలంలోని ముడుంపాడు,పెద్దినేని కాల్వ పంచాయితీ పరిధిలో సందర్శించి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే కార్యక్రమం లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన బడి నిలుస్తుందని కార్యక్రమం ద్వారా పాఠశాల బయట పిల్లలను గుర్తించి వారిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి వారిని పాఠశాలల చేర్పించే కార్యక్రమం లో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాము. ప్రతి విద్యార్థి పాఠశాల వైపు అడుగులు  వేయాలని తల్లిదండ్రులను కోరుతూ పిల్లలను పాఠశాలలో చేర్పించాలని ,ఎవరైనా బడి ఈడు పిల్లలు ఉంటే తమ దృష్టికి తీసుకోని రావాలని వారు తెలిపారు