ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా విగ్రహావిష్కరణకు భారీ ఏర్పాట్లు
నిజాంపేట్ న్యాయం ప్రతినిధి
నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ బాచుపల్లి గండిమైసమ్మ కమాన్ సర్కిల్ నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో 28వ తారీకు శనివారం ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో భారీ కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు ,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నిజాంపేట్ మేయర్, డిప్యూటీ మేయర్, కొంపల్లి, దుండిగల్ మున్సిపల్ చైర్మన్లు , జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, స్థానిక కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పార్టీలకతీతంగా నాయకులు ఎన్టీఆర్ అభిమాన సంఘ నాయకులు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నామంటే భారీ ఎత్తున దాతలు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు . సుమారుగా ఎనిమిది ఎకరాల లో సభా ప్రాంగణంలో ఏర్పాటు చేశామని 20 నుంచి 25 వేల వరకు ఈ కార్యక్రమంలో ప్రజల పాల్గొంటారని ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా భోజన సౌకర్యాలు కల్పించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీలకతీతంగా నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు ప్రజలు పాల్గొంటున్నారని తెలిపారు. ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లను మినీ మహానాడు తరహాలో ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. సభా వేదికను 100 మీటర్ల పొడవు 60 మీటర్ల వెడల్పుతో భారీ ఎత్తున ఏర్పాటు చేశారని తెలిపారు .కనుక శనివారం ఉదయం 10-30 గంటలకు మహానుభావుడు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ ఉన్నందున ఎన్టీఆర్ అభిమానులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి మల్లారెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు, మేడ్చల్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్, ప్రభుత్వ విప్ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ,కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ,జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, స్థానిక మేయర్ కొలను నీల గోపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ధన్ రాజు యాదవ్ పాల్గొంటారని తెలిపారు
.