లోన్ యాప్ వారి బాధలు భరించలేక వ్యక్తి ఆత్మహత్య

లోన్ యాప్ వారి బాధలు భరించలేక వ్యక్తి ఆత్మహత్య

కుత్బుల్లాపూర్ న్యాయం ప్రతినిధి సెప్టెంబర్ 26

నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్  బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ జయదీపిక కేకేఎం ఫేస్ 1 ఆరో ట్విన్ టవర్స్  జీ1 ప్లాట్ లో నివాసం ఉండే సిహెచ్ రాజేష్ వయసు 35 అను వ్యక్తి లోన్ యాప్ లో అప్పు తీసుకోవడంతో వారు అధికంగా బాధలు పెట్టడంతో సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఉరి వేసుకున్నాడు. మృతుడు ఉరివేసుకున్న సమయంలో ఇంటిలో ఎవరూ లేరు వారి భార్య స్వగ్రామం విజయవాడకు వెళ్ళినది. మృతుడికి భార్య 3 సంవత్సరాల 1 పాప ఉన్నది. మృతుడు బిగ్ బాస్కెట్ లో ఒక నెల క్రితం ఉద్యోగంలో చేరినట్టు సమాచారం. అతనికి కొరియర్ రావడంతో అతని భార్య ఫోన్ చేయగా ఫోను ఎత్తకపోవడంతో వాచ్మెన్ కి ఫోన్ చేసి  కొరియర్ వచ్చిన విషయం తన భర్తకు చెప్పమనడంతో వాచ్మెన్ వెళ్లి చూసేసరికి అతను ఫ్యాన్ కు ఉరేసుకున్నాడని పక్కింటి వారికి తెలపక వారు వెంటనే బాచుపల్లి పోలీస్ స్టేషన్ వారికి సమాచారం అందించగా పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని అక్కడ పరిశీలించి చూడగా బోర్డుపై నేను యాప్ లోన్ తీసుకున్నందున వారికి డబ్బులు కడుతున్నప్పటికీ కడుతున్నప్పటికీ నన్ను రోజు అనేకమైన వలగర్ లాంగ్వేజ్ తో  బాధపెడుతున్నారని నేను ఈ బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని బోర్డుపై రాశారు. ఈ యాప్ వాళ్ళని ప్రధానమంత్రి మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా వేరే వాళ్ళు లోన్ యాప్ కు గురి కాకుండా ప్రజలను యాపల ద్వారా మోసం చేస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని రాశారు. బాచుపల్లి పోలీసు వారు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ కు తరలించి కేసు పై విచారిస్తున్నామని తెలిపారు.