ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళ వాదాన్ని వినిపిస్తూ.. ద్రవిడ మోడల్ పాలనను యావత్ దేశానికి చూపిస్తామన్నారు. అంతేగాక తమిళనాడులో తమిళమే మాట్లాడతామంటూ పేర్కొన్నారు. కేంద్రంతో సంఘీభావంగా ఉంటామంటూనే..రాష్ట్ర డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గమని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ గురువారం చైన్నైలో పర్యటించారు. సీఎం స్టాలిన్‌తో కలిసి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 31,000 కోట్ల రూపాయలతో 11 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. కాగా రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మోదీ తమిళనాడులో పర్యటించడం ఇదే తొలిసారి
05/26/2022